అనకాపల్లి జిల్లా గొలుగొం మండలంలో గల సాలిక మల్లవరం గ్రామంలో గంగాదేవి గుడి చుట్టూ వెంకటరమణ ,అనే వ్యక్తి సిసి రోడ్ మీద అడ్డంగా ర్యాంపు వేయడం వల్ల నీరు మొత్తం గా గుడిలోకి వెళ్ళడానికి భక్తులకు తీవ్ర ఇబ్బందిగా ఉండటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు సిసి రోడ్డుకు నిధులు మంజూరు చేసి ఉన్నారు సిసి రోడ్ కూడా వేయడం జరిగింది ఆ రోడ్డుమీద మరల అడ్డంగా ర్యాంపు వేడ వల్ల అమ్మవారి టెంపుల్ కి వెళ్లే ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనడంతో గొలుగొండ తాసిల్దార్ కు గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ చైనులు సాలిక మల్లవరం సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు ఇక్కడ నీరు నిలువ ఉండటం వల్ల ప్రజలకు భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వెంటనే అక్రమంగా నిర్మించిన టువంటి ర్యాంపును తొలగించమని పంచాయతీ కార్యదర్శి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని వైసిపి కార్యకర్తలు అక్రమ కట్టడాలు తొలగించాలని వీల్లేదని చెప్పడంతో వైసిపి కార్యకర్తలు స్పెషలాఫీసర్ ఇబ్బందికరంగా మాట్లాడంతో ఆగ్రహం చెందిన స్పెషలాఫీసర్ వెంటనే పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్, విఆర్ఓ హరిత ,మహిళా పోలీస్, టిడిపి గ్రామ నాయకులు ఆయన వెంట ఉన్నారు.

