
కరణం ధర్మశ్రీ సోమవారం ఎలమంచిలి నిరసన శిబిరాన్ని సందర్శించి డాక్యుమెంట్ రైటర్లకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఫ్రంట్ ఆఫీస్. ఆర్ఎస్ విధానంతో మన రాష్ట్రంలో సుమారు 6 లక్షల డాక్యుమెంట్ రైటర్ల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతటా సమగ్ర సర్వేని రూపకల్పన చేసి రైతుల భూములకు రక్షణ కల్పించారు అన్నారు. పాస పుస్తకాలు. సర్వే రాళ్లపై జగన్మోహన్ రెడ్డి చిత్రపటం ఏర్పాటు చేస్తే ఈ సంస్కరణ తెచ్చిన వ్యక్తి గుర్తుకొంటారని జగన్ చిత్రం ముద్రించడం జరిగింది అన్నారు కూటమి ప్రభుత్వం జగన్ ఫోటోను ఆసరాగా తీసుకొని రైతులను మభ్యపెట్టి ప్రభుత్వం మీ భూములను తాకట్టు పెడుతుందని ప్రచారం చేసి రైతులను భయాందోళనకు గురి చేశారన్నారు. డాక్యుమెంట్ రైతులకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు. వైఎస్ఆర్సిపి నాయకులు. కార్యకర్తలో పాల్గొన్నారు.
