…
అనకాపల్లి జిల్లా – ఎలమంచిలి నియోజకవర్గం
ఎలమంచిలిలో టోయెట్స్ రేర్ ఎర్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సామాజిక బాధ్యత (CSR) నిధుల సహకారంతో సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)లో నూతన ఓపీ (OP) అదనపు భవనం మరియు నూతన అంబులెన్స్‌ను ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు అత్యవసర వైద్య సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు నూతన అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.ప్రభుత్వంతో పాటు పారిశ్రామిక సంస్థలు కూడా తమ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు చేయూతనివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. టోయెట్స్ రేర్ ఎర్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందించిన సహకారానికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, టోయెట్స్ రేర్ ఎర్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, వైద్య సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు


