మండలం లో పప్పుశెట్టిపాలెం పంచాయతీ శివారు గ్రామం జమ్మాదేవిపేట లో గొలుగొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ శ్యాం కూమార్ ఆద్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అనకాపల్లి పార్టీ పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు ఎం పి డి వో యు వి శ్రీనువాసురావు వెలుగు ఎ పి ఎం కరుణానిధి మాజీ సర్పంచ్ బెల్లపు కొండలరావు గుడివాడ మురళి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

