HomeAndhra Pradeshసామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపచుకునేందుకు దాతలు ముందుకు రావాలి

సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపచుకునేందుకు దాతలు ముందుకు రావాలి

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: శారీరకవైకల్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి అన్నారు. రాజమండ్రికి చెందిన బిర్యానీ షాపు యజమాని ఆర్.సత్తిబాబు దాత సహకారంతో సమకూరిన 5 వీల్‌చైర్లను మంగళవారం ఆమె చేతుల మీదుగా రంప చోడవరం ప్రాంతీయ ఆసుపత్రి పర్యవేక్షకులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే సాయంతో పాటు దాతలు కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.

మానవునికి చేసిన సేవే విలువైందన్నారు. వైకల్యంతో ఇబ్బంది పడేవారికి ఈ వీల్ చైర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సామాజిక స్పృహతో అందరూ చేయుత అందిస్తే మెరుగైన సేవలు అందుతాయన్నారు. అలాగే వీల్ చైర్స్ బహుకరించిన రాజమండ్రి కి చెందిన ఆర్.సత్తిబాబు ను అభిందించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు షేక్ చోటు సహకారంతో వారి కుటుంబ సభ్యులు పిట్టా శ్రీనివాస్ జ్ఞాపకార్ధం అందించినట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular