HomeAndhra Pradeshవిశాఖ పంచధారల మైనింగ్‌పై ఢిల్లీలో వైసీపీ నేతల ఫిర్యాదు

విశాఖ పంచధారల మైనింగ్‌పై ఢిల్లీలో వైసీపీ నేతల ఫిర్యాదు

అనకాపల్లిః విశాఖపట్నం జిల్లా పంచధారల సమీపంలో సాగుతున్న గ్రావెల్ అక్రమ మైనింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ తవ్వకాల వల్ల చారిత్రక వారసత్వ కట్టడాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని వైసీపీ ప్రతినిధుల బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది.పంచధారల వద్ద నిర్వహిస్తున్న మైనింగ్ కార్యకలాపాలు రెండు కీలకమైన వారసత్వ ప్రదేశాలకు ముప్పుగా పరిణమించాయని వైసీపీ నేతలు ఈ సందర్భంగా వివరించారు. పురావస్తు శాఖ పరిధిలోని ఒకటో శతాబ్దానికి చెందిన శాతవాహనుల కాలం నాటి ‘ధనదిబ్బలు’ బౌద్ధ క్షేత్రంతో పాటు, 10వ శతాబ్దంలో నిర్మించిన పురాతన శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. పరిమితికి మించి సాగుతున్న తవ్వకాలు, భారీ పేలుళ్ల కారణంగా ఈ కట్టడాల పవిత్రతకు భంగం కలగడమే కాకుండా, పంచధారల కొండ భౌగోళిక స్థిరత్వం దెబ్బతింటోందని పేర్కొన్నారు. దీనివల్ల స్థానిక భూగర్భ జలాలు, డ్రైనేజీ వ్యవస్థలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని వారు ఆరోపించారు.ఈ నేపథ్యంలో, సదరు మైనింగ్ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. మైనింగ్ సరిహద్దులు, లోతు, తవ్వకాల పరిమాణం వంటి అంశాల్లో చట్టబద్ధతను సమీక్షించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారణ అయితే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన వారిలో వైసీపీ ఎంపీలు గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి, గుమ్మ తనుజా రాణి, మద్దిల గురుమూర్తితో పాటు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పార్టీ నేత కరణం ధర్మశ్రీ ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular