అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలంలో జాతీయ జెండా రెపరెపలడింది.మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రామకృష్ణారావు తహశీ ల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ నాగమ్మ . కేజిబీవి పాఠశాలలో రోలుగుంట ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ. మండల పరిషత్ కార్యక్రమంలో ఎంపీపీ వై శ్రీనివాసరావు జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 200 ఏళ్ళ బ్రిటిష్ పాలనకు విముక్తి కలిగి ఆగస్టు 15 1947 వ సంవత్సరంలో మన దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పారు. ఎంతోమంది మహనీయులు పోరాటాలు త్యాగఫలం ఈరోజు మనం పొందుతున్న ఫలాలని గుర్తు చేశారు. 80 ఏళ్లుగా దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జగ్గారావు ప్రిన్సిపల్ తులసి తోపాటు తోటి సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
