HomeAndhra Pradesh18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఓటర్ ఎన్రోల్మెంట్ కొరకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు కలెక్టర్:దినేష్...

18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఓటర్ ఎన్రోల్మెంట్ కొరకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు కలెక్టర్:దినేష్ కుమార్

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి : పోలవరం జిల్లాలోని 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులను ఓటర్ నమోదు చేసుకునే విధంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులతో కొత్త ఓటర్లను ఎన్రోల్మెంట్ చేయుటకు, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులపై జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన యువతి యువకుల కొరకు ఓటర్ ఎన్రోల్మెంట్ కొరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలవరం జిల్లాలోని 399 పోలింగ్ కేంద్రాలలో పూర్తిస్థాయిలో బిఎల్ఓ లను నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. 2002 ఓటర్ జాబితాలో మ్యాపింగ్ కాని వారిని నోటీసులు జారీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలవరం జిల్లాలో 35 వేలమంది ఆబ్సెంట్, డెత్ లు అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వలసలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ 35 వేల మందిలో డెత్ లు, ఆబ్సెంట్లు, ఇతర ప్రాంతాల కు వలసలు వెళ్లిన వారికి పూర్తిస్థాయిలో ఒకటికి రెండుసార్లు దర్యాప్తు చేయించి ఓటర్ జాబితా నుండి తొలగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలవరం జిల్లాలో 42 కొత్త పంచాయతీలు ఏర్పాటు కొరకు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం జరిగిందని అదేవిధంగా పోలవరం జిల్లాలో ప్రస్తుతం 186 పంచాయతీలు కలవని ఆయన తెలిపారు.

పోలింగ్ స్టేషన్లో కొత్త వాటిని ఏర్పాటు చేయుటకు లికిత పూర్వకముగా తెలియజేసిన ఎడల ఎన్నికల సంఘానికి నివేదికలు పంపడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఒక సంవత్సరం పాటు ఎన్నికల సెన్సెస్ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. మూడు కిలోమీటర్లకు ఎక్కువగా దూరము ఉన్న కొత్త పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలవరం జిల్లాలో పివిటిజి లు ఎంతమంది ఉన్నది అదేవిధంగా ఎంతమంది పీవీ పీజీ లకు ఓటర్ జాబితా లో ఉన్నది నివేదికలు తయారు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలవరం జిల్లాలో సుమారు 21 వేల మంది డెత్ కేసులు ఉన్నావని ఆయన తెలిపారు. అక్టోబర్ చివరి నాటికి ఓటర్ లిస్టు పూర్తిస్థాయిలో చేయుటకు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ చేసుకొనే విధంగా ఫారం 6 నిరంతర ప్రక్రియని ఆయన అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారందరికీ ఓటు హక్కు నిబంధనల ప్రకారం ఎప్పుడైనా ఓటు హక్కు వినియోగించే విధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని ఆయన తెలిపారు. ఓటర్ జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరు పేరు ఉండే విధంగా, అనర్హుల పేర్లు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఓటరు జాబితాకు సంబంధించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచనలు సలహాలు అభ్యంతరాలు ఉన్న ఎడల నిర్ణీత గడువులోగా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. ఓటర్ జాబితాలో 8514 మంది ఓటర్ లిస్టులో మ్యాపింగ్ కాని వారు ఉన్నారని ఆయన తెలిపారు.16182 మంది ఓటర్లకు నోటీసులు జనరేట్ చేయడం జరిగిందని అదేవిధంగా 15537 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయడం జరిగిందని ఇంకా 645 మంది ఓటర్లకు నోటీసులు పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా పారదర్శకముగా, ప్రశాంతంగా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎక్కడికక్కడ తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వచ్చిన వారికి 11 రకాలైన ప్రూఫ్ లు దర్యాప్తుకు వచ్చిన అధికారులకు చూపించి వారి అర్హతలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటర్ లిస్టులలో చేర్చడం లేదా తొలగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన పెంటపాటి అనంత మోహన్, పి.శ్రీనివాసరావు (పిఆర్పి శ్రీను)కె. బాలకృష్ణ, కిరణ్, ఎన్నికల సెక్షన్ అధికారి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular