HomeUncategorizedసమస్యల పరిష్కారమే లక్ష్యంగా జ్ఞానవాని కార్యక్రమంలో జనసేన ఇన్చార్జ్ సూర్యచంద్ర.

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జ్ఞానవాని కార్యక్రమంలో జనసేన ఇన్చార్జ్ సూర్యచంద్ర.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన నర్సీపట్నం నియోజకవర్గ కార్యాలయంలో గురువారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.తెలిపారు. ఈ మేరకు శానిటేషన్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, విద్యుత్ తదితర సమస్యలకు సంబంధించిన మొత్తం 19 ఫిర్యాదులు అందాయని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు అల్లాడ సురేష్, పంచాడ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular