HomeAndhra Pradeshరాష్ట్రంలోని ఉద్యోగుల ప్రయోజనాల కోసం రాష్ట్ర జేఏసీ నేతలు నిరంతర కృషి

రాష్ట్రంలోని ఉద్యోగుల ప్రయోజనాల కోసం రాష్ట్ర జేఏసీ నేతలు నిరంతర కృషి

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు జీవో విడుదల ఏపీజేఏసీ రాష్ట్ర కమిటీ కృషికి మరో నిదర్శనమని పోలవరం జిల్లా ఏ పి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నాయకులు హడక్ కమిటీ చైర్మన్ ఎస్ కె ఫయాజ్ భాష (జిలాని), సభ్యులు ఎమ్మెస్ వెంకటేష్, కే లక్ష్మణరావు, వి పాల్ అలెగ్జాండర్, ఆర్ మహా లక్ష్మణరావు అన్నారు. రాష్ట్ర జేఏసీ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు నిత్యం ఉద్యోగుల సమస్యల పరిష్కారం సంక్షేమ కోసం కృషి చేస్తున్నారని నాయకుల కృషి వల్లే ఈనాడు జీవో నెంబర్ 78 హెచ్ఆర్ఏ పెంపు జరిగిందని ఇలాగే ఇంకా అనేక సమస్యలు పరిష్కార దిశగా రాష్ట్ర జేఏసీ అడుగులు వేస్తుందని హడక్ కమిటీ చైర్మన్ ఫయాజ్ భాష పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం ఆ సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు చేస్తున్న కృషి ఎంత అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పోలవరం (రంపచోడవరం), మార్కాపురం, అన్నమయ్య (మదనపల్లె) జిల్లాలో ఉద్యోగులు హెచ్ఆర్ఏ 12 శాతం నుంచి 16 శాతానికికు పెంచుతూ ప్రభుత్వం జీఓ నెం.78 జారీ చేయడం ఉద్యోగుల పోరాటానికి లభించిన విజయంగా జిలాని అభివర్ణించారు. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం… హక్కుల సాధనే ధ్యేయం… నిరంతర పోరాటమే ఆయుధంగా పనిచేసే ఏపీ జెఎసి అన్నారు. రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి. ఈనెల 28 న విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలని పోలవరం జిల్లా హడాక్ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని నాయకులు కోరారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఉద్యమం తప్పదని వారు పేర్కొన్నారు. విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సుకు పోలవరం జిల్లా నుండి ఉద్యోగులు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular