HomeAndhra Pradeshగంగవరంలో ప్రతిష్టాత్మక ప్రజా చైతన్య కార్యక్రమం 'ఇంటింటికి తెలుగుదేశం'

గంగవరంలో ప్రతిష్టాత్మక ప్రజా చైతన్య కార్యక్రమం ‘ఇంటింటికి తెలుగుదేశం’

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అర్హత కలిగినప్రతీ ఒక్కరికి సంక్షేమ, అభివృద్ధి పథకాలు రాజీ లేకుండా అందిస్తూ ప్రతిష్టాత్మకంగా పాలను కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటి చైర్పర్సన్, పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ శాసన సభ్యురాలు మిరియాల శిరీష దేవి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని గంగవరం మండలం నెల్లిపూడి గ్రామంలో

ఎమ్మెల్యే శిరీష దేవి పర్యటించారు. 2024 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆమె తన నియోజకవర్గంలో ముమ్మరంగా ఇంటింటా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలను నేరుగా ఎమ్మెల్యే శిరీష దేవి కలుస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీష దేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలో భాగంగా ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి , ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో ముందుకు

వెళ్తున్న శిరీష దేవి పాలన మెచ్చి తెదేపాలోకి సిఆర్ఎల్టి ఫౌండేషన్ చైర్మన్ బుడ్డిగ సతీష్ గౌడ్ వారి అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో అంకితభావంతో పనిచేసే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పల్లాల వెంకటరెడ్డి స్థానిక నాయకులు సీఆర్ఎల్ ఫౌండేషన్ చైర్మన్ బుడ్డిగ సతీష్ గౌడ్ తెలుగుదేశం సిద్ధాంతాలు నచ్చి పార్టీ తీర్థం తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వంతల రాజేశ్వరి, ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, గంగవరం సొసైటీ అధ్యక్షులు పాము అర్జున్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కనిగిరి సుభాష్, క్లస్టర్ ఇంచార్జీ దుమ్ముల భాను ప్రకాష్, రాష్ట్ర రైతు విభాగం నాయకులు కనిగిరి రాంబాబు, రంపచోడవరం మండల పార్టీ అధ్యక్షులు పెంటపాటి అసంత మోహన్, దేవీపట్నం మండల పార్టీ అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు, వై.రామవరం మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరి కాంతరెడ్డి, అడ్డతీగల మండల పార్టీ అధ్యక్షులు జర్తా వెంకటరమణరెడ్డి, సీతపల్లి దేవస్థానం గడి బాపనమ్మ తల్లి ధార్మిక మండలి సభ్యులు సిద్దా వెంకన్న దొర, యూనిట్ ఇంచార్జి, మాజీ ఎంపీపీ తీగల ప్రభ, రంపచోడవరం క్లస్టర్ ఇంచార్జీ కారం సింహాచలం, బీసీ నాయకులు జి.ఎస్. నగేష్, బూత్ ఇం చార్జి గొల్లపల్లి స్వర్ణలత, దుమ్ముల రాంబాబు, టిఎన్ఎస్ఎఫ్ నియోజక వర్గం ప్రతినిధి ముచ్చకర్ల శివ, ఎంపీటీసీ పండా ఆది నారాయణ దొర పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular