గొలుగొండ మండలంలో సిహెచ్ నాగాపురం కృష్ణ దేవి పేట గ్రామాల్లో 27 గురువారం మరిడిమాంబ పండగలు నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి అమ్మవారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు భక్తులంతా కోరిన కోర్కెలు మొక్కులు తీర్చుకున్నట్లైతే అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా కాపాడుతాయని గ్రామస్తుల నమ్మకం అమ్మవారి ఆలయాలు విద్యుత్ దీపాలతో అలంకారనచేయడం జరిగింది వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ వెల్లడించారు పూజారి ఇంటి దగ్గర నుండి ఆలయం వరకు డప్పులు తీన్మార్ వేషాలతో అమ్మవారికి పసుపు కుంకుమ నైవేద్యాలు తో భక్తులంతా ఊరేగింపుగా రావడం జరుగుతుందని తెలిపారు రాత్రికి డిజె ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని పెద్దలు ఆలయ కమిటీ వారు తెలిపారు

