HomeUmmadi Alluri Zillaప్రజాదర్బార్ కు వచ్చిన అర్జీలను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కారం ఏపీ గిరిజన సంక్షేమ...

ప్రజాదర్బార్ కు వచ్చిన అర్జీలను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కారం ఏపీ గిరిజన సంక్షేమ కమిటి చైర్పర్సన్, శాసన సభ్యురాలు మిరియాల

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: రంప నియోజకవర్గ పరిధిలోని సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహిస్తూన్న ప్రజాదర్బార్ కీ అనుహ స్పందన లభిస్తుంది. రంపచోడవరం నియోజకవర్గం లోని స్థానిక ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కొరకు ప్రజాదర్బార్ వచ్చిన అర్జీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కార చర్యలు చేపడుతున్నట్లు ఏపీ గిరిజన సంక్షేమ కమిటి చైర్ పర్సన్, శాసన సభ్యురాలు మిరియాల శిరీషాదేవి అన్నారు. చింతూరు రంపచోడవరం డివిజన్లోని సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తుందని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డ గ్రామంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులు నుండి వినతులు స్వీకరించారు. మౌళిక సదుపాయాల కల్పన కోసం వచ్చిన దరఖాస్తులపై సంబoధిత అధికారులతో చరవాణిలో మాట్లాడి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలు సమస్యలపై ప్రాధాన్యత క్రమంలో పరిష్కార మార్గాలు చూస్తానన్నారు. ప్రతీ దరఖాస్తు ఖచ్చితంగా పరిశీలించి పరిష్కారం చేసే బాధ్యత తనదన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో తన దృష్టిలో పెట్టొచ్చని సూచించారు. దరఖాస్తుదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు అన్ని కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments