HomeUncategorizedబుచ్చంపేటలో కొత్త వీధి నీటి సరఫరా సమస్యకు పరిష్కారం.

బుచ్చంపేటలో కొత్త వీధి నీటి సరఫరా సమస్యకు పరిష్కారం.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తవీధిలో నీటి సరఫరా విభాగంలో మరమ్మతులు ఏర్పడటంతో స్థానికులు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను స్థానికులు అదే గ్రామానికి చెందిన అనిమిరెడ్డి రమణ దృష్టికి తీసుకెళ్లారు.దీంతో అనిమిరెడ్డి రమణ సంబంధిత అధికారులతో సమన్వయం చేసి నీటి సరఫరా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. అధికారుల సహకారంతో శనివారం మరమ్మతులు పూర్తిచేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు.దీంతో కొత్తవీధి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేసిన అనిమిరెడ్డి రమణకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments