HomeUmmadi Alluri Zillaరెండు బాధిత కుటుంబాలకు బళ్ళ బ్రదర్స్ భరోసా

రెండు బాధిత కుటుంబాలకు బళ్ళ బ్రదర్స్ భరోసా

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం గోండోలు గ్రామంలో ఇటీవలే జరిగిన అకస్మాత్తుగా

సంభవించిన అగ్ని ప్రమాదంలో యాదాల చంటి బాబు అనే కుటుంబ సభ్యులు సర్వస్వం కోల్పోయి, కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. ఆ కుటుంబ సభ్యులను స్థానిక మండలానికి చెందిన బళ్ళ బ్రదర్స్ చంద్రమోహన్ బాబు బళ్ళ , చంద్ర శేఖర్ బాబు బళ్ళ బాధిత కుటుంబానికి పరామర్శించారు. అంతేకాకుండా సమాజిక సేవా స్పూర్తితో ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. దుస్తులు, దుప్పట్లు, చీరలు మరియు ఆర్ధిక సాయంగా 2000 రూపాయలను అందజేసి వారి కుటుంబానీకి భరోసా ఇచ్చారు. ఇదే క్రమంలో అదే గ్రామంలో బోనం వీర్రాజు అనే వ్యక్తి మరణించారన్న విషయం తెలుసుకున్న బళ్ళ బ్రదర్స్ ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించి మనోధైర్యాన్ని నింపి, వారి వంతు కొంత ఆర్థిక సహాయాని కూడా చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments