

సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా, జనసేన, వైసీపీ కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో కోరం సరిపోలేదు. దీంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్ అధికారి రామలక్ష్మి ప్రకటించారు. ఈరోజు మంగళవారం మరోసారి ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు, అయితే ఈరోజు ఎం ఎల్ ఏ కార్యాలయం లో టిడిపి జిల్లా నాయకులు మాజీ ఎమ్మెల్యే కె ఎన్ నాయుడు టిడిపి జిల్లా అధ్యక్షుడు తాతాయ్యబాబు జనసేన ఎమ్మెల్యే మరియు కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు వైస చైర్ పర్సన్ కి పోటీపడుతున్న కర్రి ఝాన్సీ మరియు గొర్రెల శివన్నారాయణ ఇద్దరితో మాట్లాడి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండమని సూచించారు అధిష్టాన నిర్ణయంతో గొర్రెల శివన్నారాయణ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో కద సుఖాంతం అయ్యింది ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే విజయ్ కుమార్ నానాజీకి అభినందనలు తెలియజేశారు చైర్ పర్సన్ పిల్లా రమా కుమారి వైస్ చైర్ పర్సన్ కి కౌన్సిలర్లకి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు
