HomeUmmadi Alluri Zillaఅన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడమే ఎన్డీయే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఎమ్మెల్యే: శిరీష

అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడమే ఎన్డీయే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఎమ్మెల్యే: శిరీష

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని రoపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి అన్నారు. కూటమి పార్టీలు ఐక్యంగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన కోసం సమిష్టిగా కృషి చేస్తున్నాయని తెలిపారు. మూడు పార్టీల మధ్య ఉన్న సమన్వయం, ఐక్యత గ్రామస్థాయి వరకు బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడంతో పాటు, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేయడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సమాన అవకాశాలు, అభివృద్ధి ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పీ4 విధానాన్ని అమలు చేస్తోందని వివరించారు.సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ఎన్డీయే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని, సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఇటీవల సంభవించిన రెండు తుఫానులను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరు, ముందస్తు సన్నద్ధత, సకాలంలో తీసుకున్న చర్యలు ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు.అదేవిధంగా మున్సిపల్ మేయర్లు, చైర్‌పర్సన్లకు ప్రత్యక్ష ఎన్నికల విధానం ప్రవేశపెట్టడం, జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలను పారదర్శకంగా, పద్ధతి ప్రకారం నిర్వహించడం ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే చర్యలని అన్నారు.కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేసే ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా గ్రామస్థాయి వరకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు వేగంగా చేరుతాయని తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు సమిష్టి కృషి అవసరమని పేర్కొన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వాలిరాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల భవిష్యత్తు, అభివృద్ధి దిశను నిర్ణయించే కీలకమైన ఎన్నికలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాల్లో పారదర్శక పాలన, జవాబుదారీతనం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలంటే ఎన్డీయే కూటమి బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు సంపూర్ణ మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు.గతంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా జరగని అభివృద్ధిని తిరిగి వేగవంతం చేయడం, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ఎన్డీయే కూటమి లక్ష్యమని తెలిపారు.రoపచోడవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ కూటమి ఐక్యతను క్షేత్రస్థాయిలో చాటాలని పిలుపునిచ్చారు.అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీయే కూటమి బలోపేతం కావాలి. గ్రామాల అభ్యున్నతి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన కోసం రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments