గొలుగొండ జిల్లా వాణి ప్రతినిధి 26.11.2026 గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ 5 .వార్డు మెంబరు అభ్యర్థిగా యర్ర మురళి పోటీ చేస్తున్నారు ఈయన గామా పార్టీ అధ్యక్షులుగా ఉంటూ గ్రామ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు అందేలా చూస్తున్నారు గ్రామంలో ఏ సమస్య ఉన్న వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తున్నారు కావున వార్డు ప్రజలంతా ఆశీర్వదించి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను మీ అందరిలో ఒక్కరిని నాకు ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే గ్రామ అభివృద్ధికి సమిష్టి కృషి చేస్తానని తెలిపారు .గ్రామంలో ఉన్న మంచినీటి సదుపాయం కరెంటు వ్యవస్థ పారిశుద్ధ్యం మొదలగు పలు సమస్యలను పరిష్కరించి పంచాయతీ అభివృద్ధికి తోడ్పడుతానని తెలిపారు మన గ్రామంలో డ్రైనేజీ సమస్య హౌసింగ్ సమస్య ఉంది మండల అధికారులకు స్పీకర్ అయ్యన్న కు మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల దృష్టికి తీసుకుని వెళ్లి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తానని తెలిపారు మన గ్రామానికి 8 సీసీ రోడ్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు అలాగే ప్రధాన సమస్య అయిన కోతుల సమస్యను ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి నివారించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు మన గ్రామం అభివృద్ధి చెందాలంటే కూటమి వార్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అని తెలిపారు

