పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: నేడు జరుగుతున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోలవరం జిల్లా పరిధిలోని ఐదు మండలాల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ బుధవారం మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన కోరారు.ఎన్నికల పోలింగ్ సరళిని మరింత పారదర్శకంగా, వేగవంతంగా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా పోలింగ్ ప్రారంభ వివరాలు, ప్రతి రెండు గంటలకు నమోదైన ఓట్ల వివరాలు, తుది పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసి ఎన్నికల అధికారులకు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ యాప్ వినియోగంపై ఇప్పటికే ఎంపీడీఓలకు శిక్షణ ఇచ్చామని, సంబంధిత రిటర్నింగ్ అధికారులు కూడా యాప్‌ను తమ మొబైల్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని, పోలింగ్ రోజున విధిగా వినియోగించాలని సూచించారు. యాప్‌లో లాగిన్ అయిన అనంతరం కొత్త పాస్‌వర్డ్ ఏర్పాటు చేసుకుని, మొబైల్‌కు వచ్చే ఆరు అంకెల ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయాలి. అనంతరం డ్యాష్‌బోర్డ్‌లోని “పోల్ డే” విభాగంలో పోలింగ్ ఏజెంట్ల నియామకం, మాక్ పోల్ వంటి ప్రారంభ వివరాలను నమోదు చేయాలి.పోలింగ్ ప్రారంభమైన తర్వాత ప్రతి రెండు గంటలకు ఒకసారి అప్పటివరకు నమోదైన ఓట్ల సంఖ్యను యాప్‌లో అప్‌డేట్ చేసి సేవ్ చేయాలి. పోలింగ్ ముగిసిన అనంతరం పురుషులు, మహిళల వారీగా తుది ఓటింగ్ వివరాలను నమోదు చేసి, మొత్తం ఓట్ల సంఖ్య ఓటర్ల జాబితాలోని వివరాలతో సరిపోలేలా జాగ్రత్త వహించాలి. పోలింగ్ సామగ్రిని భద్రంగా అప్పగించినట్లు ధ్రువీకరించిన అనంతరం తుది నివేదికను సబ్‌మిట్ చేయాలి.తుది సబ్‌మిషన్‌కు ముందు నమోదు చేసిన వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని, ఒకసారి సబ్‌మిట్ చేసిన తర్వాత డేటాలో మార్పులు చేయడం సాధ్యం కానందున పూర్తి ఖచ్చితత్వంతో వివరాలను నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. పోలింగ్ ప్రక్రియలో ప్రతి ముఖ్యమైన ఘటనను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ, ఎన్నికల సమాచారాన్ని వేగంగా అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కె. దినేష్ కుమార్ కోరారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎన్నికల అధికారి కె. దినేష్ కుమార్
RELATED ARTICLES
Recent Comments
on Hello world!
