HomeUmmadi Alluri Zillaపోలవరం జిల్లా మొదటి విడత 5 మండలాల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 69.59 శాతం...

పోలవరం జిల్లా మొదటి విడత 5 మండలాల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 69.59 శాతం పోలింగ్ నమోదు: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి:పోలవరం జిల్లా పరిధిలో గురువారం నిర్వహించిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో మధ్యాహ్నం 1 గంట సమయానికి 69.59 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో మొత్తం 1,33,079 మంది ఓటర్లు ఉండగా, వారిలో 44,526 మంది పురుషులు, 48,085 మంది మహిళలు కలిపి మొత్తం 92,611 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. ఉదయం 9 గంటలకు 32.16 శాతం, 11 గంటలకు 58.63 శాతం పోలింగ్ నమోదైందని, పోలింగు ముగిసే సమయానికి మధ్యాహ్నం 1 గంట కు 69.59 శాతం పోలైనట్లు తెలిపారు.మండలాల వారీగా పరిశీలిస్తే అడ్డతీగల మండలంలో మొత్తం 29,670 మంది ఓటర్లకు గాను 9,512 మంది పురుషులు, 10,129 మంది మహిళలు కలిపి 19,641 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 66.20 శాతం పోలింగ్ నమోదైంది. దేవీపట్నం మండలంలో 20,955 మంది ఓటర్లకు గాను 6,968 మంది పురుషులు, 7,626 మంది మహిళలు కలిపి 14,594 మంది ఓటు వేయడంతో 69.64 శాతం పోలింగ్ నమోదైంది. గంగవరం మండలంలో 21,195 మంది ఓటర్లకు గాను 7,463 మంది పురుషులు, 8,042 మంది మహిళలు కలిపి 15,505 మంది ఓటు హక్కు వినియోగించుకోగా జిల్లాలోనే అత్యధికంగా 73.15 శాతం పోలింగ్ నమోదైంది. రాజవొమ్మంగి మండలంలో 31,405 మంది ఓటర్లకు గాను 10,822 మంది పురుషులు, 11,436 మంది మహిళలు కలిపి 22,258 మంది ఓటు వేయడంతో 70.87 శాతం పోలింగ్ నమోదైంది. రంపచోడవరం మండలంలో 29,854 మంది ఓటర్లకు గాను 9,761 మంది పురుషులు, 10,852 మంది మహిళలు కలిపి 20,613 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 69.05 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ వివరించారు.జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) మాట్లాడుతూ ఐదు మండలాల పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, క్యూలైన్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణను పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగిందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments