HomeUmmadi Alluri Zillaకొత్తగా ఎంపికైన పంచాయతీ పాలకులకు ఎమ్మెల్యే దంపతులు సన్మానం

కొత్తగా ఎంపికైన పంచాయతీ పాలకులకు ఎమ్మెల్యే దంపతులు సన్మానం

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల్లో

నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, రాజవొమ్మంగి మండల జెడ్పీటీసీ మఠం విజయ భాస్కర్ ల చేతుల మీదుగా విజేతలకు ఘనంగా సాలువాలతో సత్కరించారు. వీరిలో రాజవొమ్మంగి మండలానికి చెందిన వారిలో వాతంగి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన మామిడి జోగిరాజు , చికిలింత గ్రామ పంచాయతీ సర్పంచ్‌ కొచ్చా సింహాద్రి, కిర్రాబు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఈరే రాజుబాబు ఉన్నారు. అడ్డతీగల మండలంలోని సోమన్నపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ గుంజిగెడ్డ లక్ష్మి, డి. భీమవరం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ బచ్చల అక్కమ్మ , డి. రామవరం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ బచ్చల రాధాకృష్ణ మరియు రెండు మండలాలోని వివిధ గ్రామ పంచాయతీ లలో విజయం సాధించిన ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు ఎమ్మెల్యే దంపతులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజే శారు. అనంతరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ తమపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామాల సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్యల పరిష్కారం, పారిశుధ్యం, అంతర్గత రహదారుల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటు లో ఉండాలని ఆకాంక్షించారు. రాజవొమ్మంగి జడ్పీటీసీ మఠం విజయ భాస్కర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాలను మరింత అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments