గండేపల్లి , కాకినాడ జిల్లా గండేపల్లి మండలం గండేపల్లి మాజీ సర్పంచ్ లంజపల్లి రామకృష్ణ అనారోగ్యంతో బాధపడుతూ తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ శనివారం రామకృష్ణ నివాసానికి వెళ్లారు. ఆయనను పరామర్శించి, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రామకృష్ణ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ధైర్యవచనాలు చెప్పారు.ఈ పరామర్శ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు, జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి కోర్పు సాయి తేజ, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కన్నబాబుతో పాటు పార్టీ నాయకులు, ముఖ్య నేతలు జాస్తి వసంత్, బొల్లం రెడ్డి రామకృష్ణ, చాగంటి వీర వెంకట సత్యనారాయణ, కంటిపూడి రామారావు, సుంకవిల్లి రమేష్, చిటికెల కన్నబాబు, వెంపాటి సతీష్, ముంగర సూర్యారావు, చాగంటి కృష్ణమోహన్, ఆళ్ల సత్తిబాబు, పైల వెంకన్న, ముంగర విష్ణు, కంటిపూడి జమ్మి, గరికపాటి రమణ తదితరులు పాల్గొన్నారు.

