HomeAndhra Pradeshవిద్య సంస్థలు బందుకు జయప్రదం చేయండి

విద్య సంస్థలు బందుకు జయప్రదం చేయండి

చింతపల్లి జిల్లా వాణి ప్రతినిధి: అల్లూరి సీతారామరాజు జిల్లా
విద్యార్ధి, యువజన సంఘాలు బంద్ కు పిలుపునిస్తున్నాయి ఈ సందర్బంగా చింతపల్లి గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవి మాట్లాడుతూ 2014 నుండి దేశవ్యాప్తంగా 152 పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. నీట్ పేపర్ లీకేజ్ కారణంగా దేశవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నీట్ పేపర్ లీకేజికి ప్రభుత్వం భాద్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని కోరుతూ, ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాలని గత నెల రోజులుగా ఆందోళనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. పర్యావరణ వేత్త సోనం వాంగుచుక్ నేటికి హాస్పిటల్లో ఆమరణదీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. 20వ తేదీ లక్షలాది మంది విద్యార్థుల శాంతి యూతంగా నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం కదం తొక్కారు. విద్యార్థి, యువతపైన అత్యంత అమానవీయంగా లాఠీఛార్జ్ చేయడం, టియర్ర్యాస్ను ఉ పయోగించి వేలాది మంది విద్యార్థులపై ఢిల్లీ పోలీస్లు వ్యవహరించడం హెయమైన చర్య. ఒక విద్యార్థిని హాస్పిటల్లో వెంటిలేషన్పైన ఉన్నారు. విద్యార్థుల ప్రజాస్వామ్యంను కాపాడాలని, దేశ విద్యావ్యవస్థలో సమూలమార్పులు కావాలని, నీట్ పరీక్షా విధానం రద్దుచేసి రాష్ట్రాల వారిగా మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించాలిని కొరుతూ, నీట్ తదితర పరీక్షా పత్రాల లీకేజ్ ప్రభుత్వం నైతిక భాద్యత వహించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 24వ తేదీన తలపెట్టిన దేశ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కు మన జిల్లాలోని పాఠశాలలు,కళాశాలలు,కోచింగ్ సెంటర్లు సంపూర్ణగా బంద్ కు. సహకరించాలిని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు వినాయక్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular