HomeUmmadi Alluri Zillaప్రశాంతంగా 87 సర్పంచ్, 734 వార్డులకు ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది: కలెక్టర్ దినేష్ కుమార్

ప్రశాంతంగా 87 సర్పంచ్, 734 వార్డులకు ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది: కలెక్టర్ దినేష్ కుమార్

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లా పరిధిలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఐదు మండలాల్లో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విడతలో మొత్తం 91 గ్రామ పంచాయతీలు, 850 వార్డులకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు, పోలీసు సిబ్బంది, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపారు. తొలి విడతలోని 91 సర్పంచ్ స్థానాల్లో 4 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 87 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా మొత్తం 850 వార్డులకు గాను 116 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 734 వార్డులకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. అడ్డతీగల మండలంలోని డి. భీమవరం గ్రామ పంచాయతీ పరిధిలోని వార్డులో ఒకరికి ఒకరు పోటీగా నిలిచిన అభ్యర్థులతో సహా ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించారు.తొలి విడతలో ఎన్నికలు నిర్వహించిన గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ఫలితాలన్నింటినీ ప్రకటించడం ద్వారా రాష్ట్రంలోనే తొలి విడత ఎన్నికల ఫలితాల ప్రకటన ప్రక్రియను పూర్తిచేసిన తొలి జిల్లాగా పోలవరం జిల్లా నిలిచిందని కలెక్టర్ తెలిపారు. అలాగే ఉపసర్పంచ్‌ల ఎన్నికలకు సంబంధించి పరోక్ష పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో 86 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయని వెల్లడించారు.ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు విధులు నిర్వర్తించిన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది, కౌంటింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరుల సేవలను కలెక్టర్ అభినందించారు. గురువారం ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఆన్ డ్యూటీ (OD) సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఇదిలా ఉండగా, ఈ నెల 29వ తేదీన పోలవరం జిల్లా పరిధిలోని ఏడు మండలాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. సంబంధిత మండలాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది ఓటు హక్కును కోల్పోకుండా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.రెండో విడత ఎన్నికలను కూడా ఇదే తరహాలో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments