

రిపోర్టర్ రఘురామ శేషు: యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో 2nd year చదువుతున్న మన్యంపాలెం గ్రామానికి చెందిన కళ్ళం నాగేశ్వరి, 18 yrs అను ఆమె అదే గ్రామానికి చెందిన మట్టా అప్పలరాజు యొక్క AP 40KW 6675 అను నెంబర్ గల బైక్ పై యలమంచిలి లోగల కాలేజీ కి వెళ్తుండగా సుమారు 09.00 గంటల సమయం లో రేగుపాలెం జంక్షన్ వద్దకు వచ్చేసరికి అనకాపల్లి వైపు వెళ్ళి రోడ్ లో నుండి యలమంచిలి దారికి లోకి టర్న్ అవ్వడానికి జంక్షన్ వద్ద ఆగి వున్న TG 05 U 6336 అను నెంబర్ గల లారీ వెనుక ఆగినారు. ఈ లోగ అక్కడ ఆగిఉన్న ఆ లారీ డ్రైవర్ అకస్మాత్తుగా లారీని రోడ్ క్రాస్ చేయడానికి ప్రయత్నించగా అదేసమయం లో అనకాపల్లి వైపు నుండి తుని వైపు వెళ్తున్న RJ 29 GB 1134 అను నెంబర్ గల లారీ డ్రైవర్ తన లారీ ను కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నించగా సదరు లారీ అదుపు తప్పు రోడ్ పై పడిపోయింది. సదరు లారీ లో ఉన్న ఐరన్ రోల్ బ్యాండిల్స్ రోడ్ పై ఆగిఉన్న ఏపీ 40 KW 6675 బైక్ పై పడడం వలన బైక్ పై ఉన్న ఇద్దరికి బలమైన గాయాలు అయినవి. ఇద్దరిని హైవే అంబులెన్స్ లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కళ్లెం నాగేశ్వరి మృతి చెందినది.
