పోలవరం జిల్లావాణీ ప్రతినిథి పోలవరం జిల్లాలో రెండవ విడత, తుది దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన ఆయా మండలాలకు చేరుకుని, అక్కడి నుంచి పోలింగ్ సామగ్రిని స్వీకరించి తమకు నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని వెల్లడించారు. ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని 7 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని వి.ఆర్.పురం, చింతూరు, కూనవరం, యటపాక మండలాలతో పాటు రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మారేడుమిల్లి, వై.రామవరం, గూర్తేడు మండలా ల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సర్పంచ్ స్థానాలకు సంబంధించి 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం, రెండవ విడతలో మొత్తం 95 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టగా, 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. వెంకటరెడ్డిపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 90 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ సర్పంచ్ స్థానాలకు మొత్తం 281 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 122 వార్డులు ఏకగ్రీవం.. 757 వార్డులకు పోలింగ్, అదేవిధంగా జిల్లాలో మొత్తం 884 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టగా, 122 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మరో 5 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 757 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ స్థానాల్లో మొత్తం 1,725 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మారేడుమిల్లి మండలంలోని మర్రిగూడెం గ్రామ పంచాయతీలో 3, 5వ వార్డులకు, వెంకటరెడ్డిపేట గ్రామ పంచాయతీలో 3, 4, 5వ వార్డులకు నామినేష న్లు దాఖలు కాలేదని ఎన్నికల అధికారులు వెల్లడించారు.పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు చర్యలు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన పోలింగ్ సామగ్రిని అందజేసి, వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రా ల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతం గా నిర్వహించాలని, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ కోరారు.
నేడు 7 మండలాలు 90 గ్రామ పంచాయతీలు, 757 వార్డులకు ఎన్నికలు
RELATED ARTICLES
Recent Comments
on Hello world!
