HomeUncategorizedతామరాడ జెడ్పీ హైస్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుముఖ్య అతిథిగా జగ్గంపేట జనసేన ఇంచార్జ్...

తామరాడ జెడ్పీ హైస్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుముఖ్య అతిథిగా జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్

కిర్లంపూడి, ఆగస్టు 15: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించినట్లే కన్నతల్లిలాంటి దేశాన్ని ప్రేమించి, గౌరవించడం కూడా విద్యార్థుల బాధ్యత అని సూచించారు.పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులు సౌకర్యవంతంగా భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ అవసరమని ఉపాధ్యాయులు కోరగా, దీనిపై సానుకూలంగా స్పందించిన రమేష్ డైనింగ్ హాల్ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులకు ఉపాధ్యాయులు సొంత నిధులతో అందించిన ప్రోత్సాహకాలను రమేష్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం విద్యార్థులను శాలువాలతో సత్కరించి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో సర్పంచ్ తుమ్మలపల్లి సాయి గుణశేఖర్ స్వీట్లను స్పాన్సర్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోకేడ రాజా, అనుకుల శ్రీకాంత్, కాయల మణికంఠ, సత్యంశెట్టి గణేష్, కాయల శ్రీను, అనుకుల చంటిబాబు, ప్రధానోపాధ్యాయులు కృష్ణ, గోకేడ ప్రసాద్, పంచాది నానాజీ, సేనాపతి చెల్లారావు, తుంగపల్లి తరుణ్, గోకేడ రమణ, నల్లల నాని, గోకేడ పండు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular