80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట లోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఉత్తమ సేవ పురస్కారాలు అందుకున్నారు. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ సేవా పురస్కారానికి జగ్గంపేట సెక్షన్ జూనియర్ ఇంజనీర్ కె. నాగ వెంకట ప్రసాద్, టౌన్ లైన్మెన్ శ్రీమన్నారాయణ, జగ్గంపేట టౌన్ అసిస్టెంట్ లైన్మెన్ బి.వి.రమణ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్ ఈ చేతుల మీదుగా ఉత్తమ సేవ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు…ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు..

