HomeUncategorizedఅనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని వీసం...

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని వీసం సాయి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు

269 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 11 మందిని కంటి ఆపరేషన్ కి పంపించడం జరిగింది.

విషయం:- ఈ రోజు యస్.రాయవరం గ్రామంలో వీసం సాయి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం లో 269 మందికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అదేవిధంగా దంత వైద్య పరీక్షలు మరియు కంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నుంచి 11మందిని కంటి ఆపరేషన్ కోసం పాయకరావుపేట హైమ నేత్రాలయం కి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాగరదుర్గ & సింహాద్రి హాస్పిటల్స్ M.D కృష్ణ గారు మరియు శ్రీ లక్ష్మీ సాయి దంత వైద్యశాల డెంటల్ సర్జన్ నరేష్ కుమార్ గారు, చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ సుస్మా గారు, డాక్టర్ కవిత గారు జనరల్ సర్జరీ, కంటి వైద్య నిపుణులు మరియు వైద్య సిబ్బంది & జనసేన నాయకులు లింగంపల్లి జ్యోతి కుమార్, తేటకాలి అరవింద్, మాలెం రాజు, జాగు భాను, వీసం స్వామి, పల్లెల లక్ష్మణరావు, దుబాసి మురళి, వీర్ల నాని పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular