HomeUncategorizedఎంకే పట్టణంలో గ్రామసభ ఎస్సీ, ఎస్టీ బీసీ ఓటర్ల జాబితా ప్రకటించిన ఎంపీడీవో నాగేశ్వరరావు.

ఎంకే పట్టణంలో గ్రామసభ ఎస్సీ, ఎస్టీ బీసీ ఓటర్ల జాబితా ప్రకటించిన ఎంపీడీవో నాగేశ్వరరావు.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఎం కె పట్నం గ్రామంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామ ఓటర్ల జాబితాను పరిశీలించి, ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల వివరాలను సిద్ధం చేశారు.గురువారం ఎంకే పట్నంలో నిర్వహించిన గ్రామసభలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలను ప్రకటించారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు, వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. జాబితాలో ఏవైనా అభ్యంతరాలు లేదా తప్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular