HomeAndhra Pradeshప్రభుత్వం అందిస్తున్న మెనూను తూచా తప్పకుండా అమలు చేయాలి, ఈర్లపల్లి ఆశ్రమ పాఠశాలలో లోపాలపై ...

ప్రభుత్వం అందిస్తున్న మెనూను తూచా తప్పకుండా అమలు చేయాలి, ఈర్లపల్లి ఆశ్రమ పాఠశాలలో లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన: కలెక్టర్

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి రంపచోడవరం మండలం ఈర్లపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా

విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్.. పాఠాలు అర్థమవుతున్నా యా, ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా, పాఠశాలలో మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా అనే

అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. పాఠ్యాంశా లను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించాలని, అవసరమైతే ఒకటికి రెండుసార్లు వివరించాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఆశ్రమ

పాఠశాలకు సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకులు, పాలు, గుడ్లు, కోడి మాంసం, కూరగాయల నాణ్యత, సరఫరా విధానంపై కలెక్టర్ ఆరా తీశారు. ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలపై తగిన పర్యవేక్షణ లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్‌ఎం ఎస్. రాజేశ్వరి గైరాజరుపై, డిప్యూటీ వార్డెన్ కె. అనురాధ విధుల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.విధుల పట్ల నిర్లక్ష్యం, ఆహార నాణ్యతపై పర్యవేక్షణ లోపాలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు పాటించని సరఫరాదారులపై చర్యలు తీసుకుని, అవసరమైతే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్యా బోధన, అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular