HomeUncategorized*నక్కపల్లి లో ఉచిత మహిళా ఆరోగ్య శిబిరం*

*నక్కపల్లి లో ఉచిత మహిళా ఆరోగ్య శిబిరం*

నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి

మండలం లోని వేంపాడు వికాస తరంగిణి శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం మహిళా ఆరోగ్య వికాస్ ,
పట్టణానికి చెందిన గోష్ఠి సభ్యుల ఆర్థిక సహకారంతో ఉచిత మహిళా ఆరోగ్య శిబిరాన్ని
స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు.ఈ మేరకు 72 మంది మహిళలకు గర్భాశయ, రొమ్ము పరీక్షలు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు.విశాఖపట్నం కు చెందిన డాక్టర్ దేవయాని, శ్రీ చిన్న జీయర్ స్వామి వారి శిష్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని శిబిరానికి వచ్చిన మహిళలకు వారి ఆరోగ్య విషయంలో ఏ విధంగా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే బాగుంటుందో శ్రీ చిన్న జీయర్ స్వామి శిష్యురాలు లత అవగాహన కల్పించారు. అనంతరం మహిళలకు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది.ఇప్పుడు ఉన్న జీవన ప్రమాణం లో ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం ముఖ్యమని తమ ఆరోగ్యం కొరకు ఎన్నో రకాల ఇబ్బందులుతో జీవితం గడుపుతున్నారని ఇలాంటి ఉచిత శిబిరాలు తో సేవలు అందించడం అభిననందనీయమని పలువురు కొనియాడారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular