HomeAndhra Pradeshకాకరాపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యం.

కాకరాపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యం.

కోటనందూరు జిల్లా వాణి ప్రతినిధి

కాకినాడ జిల్లా, కోటనందూరు మండలం, కాకరాపల్లి గ్రామానికి చెందిన లంక మరిణియ్య అలియాస్ బాబ్జి గత నెల 31వ తేదీన అదృశ్యమైనట్లు ఎస్సై టి రామకృష్ణ తెలియజేశారు. అదృశ్యమైన వ్యక్తి బంధువు లంక ప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం కాకరాపల్లి గ్రామానికి చెందిన లంక బాబ్జి గత నెల 31వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో తాను అద్దెకు ఉంటున్న ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని బంధువులు ఆందోళన చెందుతున్నట్లు తెలియజేశారు. అదృశ్యమైన లంక బాబ్జి వయసు 58 సంవత్సరంలు ఉంటాయని ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు ఎరుపు తెలుపు రంగులో ఉండి సన్నగా ఉంటారని తెలియజేశారు. అదృశ్యమైన సమయంలో సిమెంట్ కలర్ ట్రాక్ ప్యాంటు బిస్కెట్ కలర్ షర్ట్ ధరించారని ఆచూకీ తెలిపిన వారు కోటనందూరు పోలీస్ స్టేషన్ కు 9440900773 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular