అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కుసర్లపూడి గ్రామంలో వైఎస్సార్సీపీ పార్టీ సర్పంచ్ మడ్డు అప్పలనాయుడు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పేదలు మరియు బలహీన వర్గాల కోసం చేపట్టిన పలు కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సేవలో ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేశారు.కుసర్లపూడి గ్రామ సర్పంచ్ మడ్డు అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు.
