HomeUncategorizedబుచ్చెంపేటలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

బుచ్చెంపేటలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీవీఎస్ఎన్ రాజు సారథ్యంలో, రోలుగుంట మండల వీర మహిళా అధ్యక్షురాలు చిటికెల శ్రీ నాగ దుర్గా మహేశ్వరి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు.పవన్ కళ్యాణ్ పేరున ప్రత్యేక అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం డీజే సంగీతంతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకు, నిరుపేదలకు పండ్లు, రొట్టెలు, పాలు పంపిణీ చేశారు. నిరాశ్రయులకు అల్పాహారం, భోజనం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల వీర మహిళా అధ్యక్షురాలు నాగ దుర్గా మహేశ్వరి మాట్లాడుతూ.. ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన జనసైనికులు, వీర మహిళలు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular