HomeUncategorizedపవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రత్నంపేటలో 25 మంది రక్తదాతలతో బ్లడ్ డొనేషన్ క్యాంప్.

పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రత్నంపేటలో 25 మంది రక్తదాతలతో బ్లడ్ డొనేషన్ క్యాంప్.

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రత్నంపేట గ్రామంలో జనసేన యువత ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పార్టీ చోడవరం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పీవీఎస్ఎన్ రాజు సారథ్యంలో, రత్నంపేట యూత్ నాయకుడు పెద్దాడ నాగేష్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.వేడుకల్లో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించనున్నారు. ఇప్పటికే రక్తదానం చేసేందుకు 25 మంది రక్తదాతలు ముందుకు వచ్చారు. పెద్దాడ నాగేశ్వరరావు, బత్తిన సన్యాసిరావు, సిరిసిపల్లి శివ, కొరుకొండ మారిడి, పిట్ల అప్పలనాయుడు, బియ్యాల అప్పలనాయుడు, మజ్జి చిన్నబాబు, వూడి ఈశ్వరరావు, వెలిశెట్టి రాజు, ఎడ్ల నరేష్, నిట్టా సోమినాయుడు, బొల్లం రాము, సూరపు గణేష్, పాతల వాసు, మాచా పెంటారావు, వెచం నరేంద్ర, జారిపోతుల దుర్గ, మామిడి దుర్గాప్రసాద్, పాలక నాగార్జున, వూడి రాజేష్, బత్తిన చిట్టిబాబు, పీలా వేణు, అంజూరు జగదీష్, వూడి కాసు, మహేష్ రక్తదానం చేయనున్నట్లు తెలిపారు.అదేవిధంగా ఉదయం దేవాలయంలో పవన్ కళ్యాణ్ సకుటుంబ సమేతంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేయనున్నారు. సాయంత్రం నిరుపేదలకు అన్నదానం, కేక్ కటింగ్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.ఈ సందర్భంగా పీవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ, గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వార్థ రాజకీయాలకు దూరంగా ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.రక్తం దానం చేయండి.. ప్రాణాలు నిలబెట్టండి అనే సందేశంతో చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో రత్నంపేట యూత్ సభ్యులతో పాటు జనసేన కుటుంబ సభ్యులు, వీర మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular