రోలుగుంట: రోలుగుంట గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో నెలకొన్న తాగునీటి సమస్యపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ.5 లక్షల నిధులు మంజూరు చేసిందని కూటమి నాయకుడు తెలిపారు. ప్రజలు నేరుగా ప్రభుత్వాన్ని తాగునీరు అందించాలని కోరడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి నిధులు మంజూరు చేయించారని పేర్కొన్నారు.ఎండాకాలంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి గతంలోనే ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీరు అందించినట్లు తెలిపారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో బోర్లు వేయించి, మినీ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి ప్రజలకు నీటి సౌకర్యం కల్పించేందుకు తమవంతు కృషి చేసినట్లు చెప్పారు.అయితే తాజాగా కొన్ని పత్రికల్లో స్థానిక జెడ్ పి టి సి చొరవతో రూ.5 లక్షల నిధులు తీసుకొచ్చినట్లు ప్రచారం జరిగిందని, అందులో వాస్తవం లేదని ఆయన ఆరోపించారు. ప్రజలు నేరుగా కూటమి ప్రభుత్వాన్ని కోరడంతోనే ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసిందని స్పష్టం చేశారు.
నిధులు ఎవరి వ్యక్తిగత చొరవతోనో, ప్రతిభతోనో మంజూరు కాలేదు. ప్రజల విజ్ఞప్తికి కూటమి ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసింది” అని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జెడ్పిటిసి జెడ్ నిధుల ద్వారా రోలుగుంట గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం ఒక బోరు కూడా వేయించారా? అని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవాలను ప్రజలు గమనించాలని ఆయన కోరారు. రోలుగుంటలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
