పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఏజెన్సీ ప్రాంతం లోని అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని పగటిపూట వైద్యం పేరుతో వారి ఇళ్లకు వెళ్లి ఇంట్లోనే పరిస్థితులను పసిగట్టి , వారు ఇళ్లల్లో లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి ఆగడాలను ఎట్టకేలకు రాజవొమ్మంగి పోలీసులు చెక్ పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే రాజవొమ్మంగి పోలీసు సర్కిల్లోని ఇటీవలే వరస దొంగతనాలు వెలుగులోకి రావడంతో చోరీలు జరుగుతున్న తీరుతెన్నులపై రాజవొమ్మంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసినాయుడు నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా ఉంచారు. ఈక్రమంలోనే వైద్యం పేరుతో గ్రామాల్లో సంచరిస్తున్న మదగల శ్రీని వాస్ (28) అనే వ్యక్తి కదలికలపై నిఘపెట్టి దొంగతనాలకు పాల్పడుతున్న శ్రీనివాస్ ను ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని రంపచోడవరం డీఎస్పీ ఆశ్రఫ్ అలీ మరియు రాజవొమ్మంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసినాయుడు, ఎస్సై వెంకట్రావు సంయుక్త ఆధ్వర్యంలో గురువారం మీడియా సమావేశం ముందు నిందితుడిని ప్రవేశపెట్టారు. డీఎస్పీ మీడియాకు తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. వైద్య సేవల పేరుతో గ్రామాల్లో ఎం శ్రీనివాస్ తిరుగుతూ ముందుగా ఇళ్లను రెక్కీ చేసి, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు నివసించే ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న డీఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు ఇళ్లలో

చోరీలకు పాల్పడి నేరం నిందితుడు అంగీకరించినట్లు డీఎస్పీ మీడియాకు వివరించారు. నిందితుడి వద్ద నుంచి 82 గ్రాముల బంగారం, 20 తులాల పట్టీలు, రూ.54 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ అశ్రఫ్ అలీ మీడియాకు వెల్లడించారు. నిందితుడిని అడ్డతీగల కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తును చోరీ కేసుల్లో బాధితులకు అప్పగించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వరుస దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు నిందితుడు శ్రీనివాస్ పోలీసులకు చిక్కడంతో ప్రస్తుతం మండలంలోని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నా రు. చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పకడ్బందీగా దర్యాప్తు చేసి పట్టుకునేందుకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ రమణ, కానిస్టేబుళ్లు చిన్నలుదొర, సూర్యప్రకాష్ లను ఉన్నతాధికారులు అభినందించారు.
