HomeAndhra Pradeshపోలవరం జిల్లాలో ఈనెల 9న మెగా జాబ్‌మేళా: కలెక్టర్ కె. దినేష్‌కుమార్

పోలవరం జిల్లాలో ఈనెల 9న మెగా జాబ్‌మేళా: కలెక్టర్ కె. దినేష్‌కుమార్

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లాలో చదువుకున్న యువతీ యువకులకు ప్రైవేట్‌ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ 9న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్‌కుమార్ తెలిపారు.గురువారం సాయంత్రం రంపచోడవరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 40 ప్రముఖ కంపెనీల ఆధ్వర్యంలో ఈ నెల 9న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జాబ్‌మేళాలో వివిధ కేటగిరీలకు సంబంధించి సుమారు 1,500 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగం, అర్హతలను బట్టి నెలకు రూ.15,000 నుంచి రూ.50,000 వరకు వేతనం లభించే అవకాశం ఉందన్నారు. పదో తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హతలు కలిగిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. జాబ్‌మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఆధార్‌కార్డు, విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, వాటి జిరాక్స్‌ ప్రతులను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.పోలవరం జిల్లాలోని నిరుద్యోగ యువత ప్రైవేట్‌ రంగంలోని ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె. లచ్చారావు, మేనేజర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular