పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ ఛైర్పర్సన్ మిరియాల శిరీష దేవి రాజవొమ్మంగి మండలం లోదొడ్డి పంచాయితీలో శనివారం ఉదయం పర్యటించనున్నారని ఏపీఐఐసీ డైరెక్టర్, రాజవొమ్మంగి మండలం టీడీపీ అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు పేర్కొన్నారు. ముందుగా ఉదయం పాకవేల్తీ గ్రామంలో గిరిజన రైతులకు భూ పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శిరీష దేవి చేతుల మీదుగా పట్టదారు పాసు పుస్తకాలను అందజేస్తారు. అనంతరం మధ్యాహ్నం లోదొడ్డి గ్రామంలో ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తారని పెద్దిరాజు తెలియజేశారు. ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో మండలం లోని తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని పెద్దిరాజు మీడియా ద్వారా పిలుపునిచ్చారు.
