పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: పోలవరం జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజనల్ పరిపాలన అధికారిగా అల్లు సత్యనారాయణ మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు స్థానిక కార్యాలయ సిబ్బంది సాదరంగా ఆహ్వానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లు సత్యనారాయణ ఇప్పటి వరకు రాజవొమ్మంగి మండల రెవెన్యూ ఇన్చార్జి తహసీల్దార్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఎనలేని సేవలు గుర్తించిన ప్రభుత్వం పదోన్నతిపై డీఏవోగా నియమించారు. ఈసందర్భంగా
సత్యనారాయణ మాట్లాడుతూ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకు రెవెన్యూ సేవలు అందించడంతోపాటు సమస్యలను పరిష్కరించేందుకుతన వంతు ప్రత్యేక కృషి చేస్తానని ఆయన వాపోయారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు సరిత, శ్రీధర్, జిలాని, ఇందిరాభాయి తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.
