అచ్చుతాపురం మండలం దోసూరు గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త మట్ట కృష్ణ తల్లి అర్ధరాత్రి ఆకస్మిత మృతి చెందారు ఈమె మృతికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు , ఎలమంచిలి ప్రాజెక్టు లీడర్ సుజాత అచ్యుతాపురం అంగన్వాడి యూనియన్ నాయకులు పి నారాయణమ్మ, వరలక్ష్మి, రేవతి, సత్యవతి ,సిఐటియు నాయకులు ఆర్ రాము, కె సోము నాయుడు మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్ రావు మాట్లాడుతూ మట్ట కృష్ణ తల్లి నిన్న జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో చాల ఉత్సాహంగా పాల్గొని అకాల మృతి చెందడం కుటుంబానికి తీరనిలోటని వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

