పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మతిభ్రమించి మాట్లాడుతున్న ఏకైక నాయకుడు జగన్ అని రంపచోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు గణజాల తాతారావ్ వాపోయారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాకు పత్రిక విడుదల చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి అయ్యిండి ,ఒకసాధారణ వ్యక్తి కి ఉండే పరిజ్ఞానం కూడా లేకుండా జగన్ మాట్లాడడం అత్యంత శోచనీయమని తాతారావు అన్నారు. గడికొక మాట మాట్లాడటం ఒక్క జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లిందన్నారు. ఈసందర్భంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మూడు రాజధానులు నిర్మిస్తాం అని అన్నది మీరు కాదా జగన్? అని తాతారావు మీడియా ద్వారా ప్రశ్నించారు. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం పరిపాలన అన్నది మీరు కాదా జగన్? అమరావతి చట్టసభల రాజధాని అన్నది మీరు కాదా జగన్? కర్నూలు న్యాయ రాజధాని అన్నది మీరు కాదా జగన్? 2019ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని అక్కడ ప్రజలను నమ్మించి నెగ్గావు అని తాతారావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అమరావతికి వెచ్చించిన ప్రజాధనం ను విధ్వంస రీతికి తీసుకొచ్చావని అన్నారు.
ప్రాంతాలను విడగొట్టి,విద్వేషాలు రెచ్చగొట్టి నేను మాత్రమే మూడు రాజధానులతో అందరికీ న్యాయం చేస్తానని అన్నది మీరు కాదా జగన్ అని సూటిగా ప్రశ్నించారు. అంత చక్కగా మూడు రాజధాని లు సమర్థించుకున్న మీరు ఆ స్టాండ్ నుండి ఎందుకు తప్పుకున్నారో ఇప్పుడు ప్రజలకు వివరించాలని తాతారావు డిమాండ్ చేశారు. మీరు చేసిన విద్వాంసాలను చూసిన ఆయా ప్రాంతాల ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందుకే మిమ్మల్ని తిరస్కరించారన్నా రు. విశాఖ నుండే పరిపాలన అని మీరు అన్నా , ప్రజలకు కూడా తెలుసు మీరు మళ్లీ అధికారంలోకి వస్తే విధ్వంసం, గుండాయిజం, రౌడీయిజం, భూకబ్జాలు ఆర్థిక వ్యవస్థ కుదేలు తప్ప ఇంకేమీ ఉండవని, 2024లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి 11 శాసనసభ్యులకు పరిమితం చేశారని తాతారావు చెప్పుకొచ్చారు. చేసిన తప్పులను సరిదిద్దుకోవటం పోయి అధికారం పోయిందన్న అక్కుసతో అవగాహన లేమితో మతిభ్రమించి నోటికి వచ్చినట్లు జగన్ మాట్లాడుతున్నరన్నారు. మూడు రాజధానులు పోయి మావిగన్ అన్నారు. దాని మీదకూడా మీ స్టాండ్ లేకుండా నిన్న విజయవాడ వెళ్ళి విజయవాడ రాజధాని అంటున్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తే విజయవాడ,గుంటూరు అన్నీ కలిసి నగరాల కూడలి అవుతుందన్న జ్ఞానం లేకపోతే ఎలా జగన్? ఎక్కడకు నువ్వు వెళ్ళి మాట్లాడితే అదే రాజధాని చేసేస్తానంటే ప్రజలు నవ్వుకుంటున్నారు జగన్? తిరుపతి వెళితే అది రాజధాని అంటావేమో? కర్నూల్ వెళితే అది రాజధాని అంటావేమో? ఒంగోలు వెళితే అది రాజధాని అంటావే మో? ఇంకా ఎన్ని రాజధానులు అంటావేమోనని రాష్ట్ర ప్రజలు జగన్ మాటలను హాస్యాస్పదంగా మాట్లాడుకుంటున్నారన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను చేసిన ఘనత నీది కాదా జగన్?2024 కు ముందు పిల్లలు పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏమిటో వ్రాసే పరిస్థితి కూడా లేకుండా చేసావ్ అని తాతారావు పేర్కొన్నారు. అమ రావతి రాజధాని పనులు శరవేగం గా జరుగుతుంటే చూసి ఓర్వలేక కుయుక్తులు పన్నుతున్నావు. ప్రపంచ దేశాల్లోనే ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో అమరావతికి భూములు సేకరించిన ఘనత విజనరీ లీడర్ చంద్రబాబు అన్నారు. రాష్ట్రంకు ఎన్నో పెట్టుబడులు తెచ్చి పరిశ్రమల స్థాపన శరవేగంగా జరుగుతింటే అవి చూసి కంటగింపు కలిగి పని అయిపోయిందని జగన్ లేనిపోనీ అడ్డంకులు సృష్టిస్తున్నరని స్పష్టం చేశారు. సంక్షేమం ,అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అశ్వీరదిస్తున్నా రు. ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇకనైనా జగన్ పద్దతి మార్చుకో అని ఆయన అన్నారు. కనీసం రాజకీయ నాయకుడుగా నైనా గుర్తిస్తారు? మతిబ్రమించి మాట్లాడుతున్న నీ ప్రతి అడుగు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నరన్నారు. తీరు మర్చిపోకపోతే రాబోయే రోజుల్లో వైసీపీకి 11 సీట్లు కాదు గదా సింగిల్ డిజిట్ కు పరిమితం చేస్తారని తాతారావ్ ఎద్దేవా చేశారు..
