పోలవరం జిల్లావాణి ప్రతినిధి: పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని గురువారం పరిశీలించేందుకు జిల్లాకు విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఇతర ప్రజాప్రతినిధులకు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా దేవిపట్నం మండలంలోని శ్రీ శ్రీ శ్రీ గండి పోచమ్మ అమ్మవారి ఆలయంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అధికారిక లాంఛనాలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అమ్మవారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేయగా, ఆలయ ఈవో ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలు అనుసరించి తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు, పునరావాస కార్యక్రమాల పురోగతి, హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యాంశాలను జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, రంపచోడవరం ఆర్డీవో కె. స్వాతి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
