HomeAndhra Pradeshఅనారోగ్యంతో అంగన్‌వాడీ టీచర్ మృతి, బీమా, గ్రాట్యుటీ సదుపాయాలు ఉద్యోగ భద్రతకల్పించాలని సీఐటీయూ డిమాండ్

అనారోగ్యంతో అంగన్‌వాడీ టీచర్ మృతి, బీమా, గ్రాట్యుటీ సదుపాయాలు ఉద్యోగ భద్రతకల్పించాలని సీఐటీయూ డిమాండ్

చింతపల్లి, జిల్లావాణి ప్రతినిధి: అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ దోమలగొంది గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ వానికేడి పార్వతమ్మ (40) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్నారు. ఆమె పరిస్థితి విషమించడంతా కుటుంబ సభ్యులు ఆమెను స్వగ్రామంకి తరలించారు. ఆరోగ్య పరిస్థితి చెయ్యి జారిపోవడంతో ఆమె తుది శ్వాస విడిచారు. మినీ అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న పార్వతమ్మకు ఇటీవలే మెయిన్ అంగన్‌వాడీ టీచర్‌గా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన కొద్దికాలానికే ఆమె మృతి చెందడం అంగన్‌వాడీ సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతదేహానికి సీఐటీయూ, అంగన్‌వాడీ నాయకులు ప్రాజెక్ట్ లీడర్ పి పెంటమ్మ. సెక్టర్ లీడర్లు. నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. తదనంతరం వారి వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు పి. పెంటమ్మ మాట్లాడుతూ, మృతి చెందిన అంగన్వాడీ టీచర్ పార్వతమ్మకు. ముగ్గురు పిల్లలు భర్త ఉన్నారు అని అన్నారు. అంగన్వాడి టీచర్ మృతి చెందడంపై ఎటువంటి ఉపాధి లేక దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు అంగన్‌వాడీ టీచర్లకు బీమా, గ్రాట్యుటీతో పాటు ఇతర సంక్షేమ సదుపాయాలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధుల్లో ఉండగానే మరణించిన అంగన్‌వాడీ సిబ్బంది కుటుంబాలకు తగిన ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, సెక్టర్ లీడర్లు చెల్లయమ్మ. రాణి.. వెంకటలక్ష్మి. తేజ. ప్రశాంతి. రాజేశ్వరి. పుష్ప. సుభద్ర. నాగరత్నం. సత్యవతి. శాంతి. స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular