HomeAndhra Pradeshపోలవరం జిల్లా ప్రధాన కేంద్రం రంపచోడవరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు 159 దరఖాస్తులు

పోలవరం జిల్లా ప్రధాన కేంద్రం రంపచోడవరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు 159 దరఖాస్తులు

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి : పోలవరం జిల్లాలోని మారుమూల గ్రామాలకు సంబంధించిన సమస్యల దరఖాస్తులు వ్యక్తిగతమునకు సంబంధించిన సమస్యల దరఖాస్తులను స్వీకరించి కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించి మరికొన్ని సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కార మార్గాలు అన్వేషించి సమస్యలు పరిష్కారం కొరకు సంబంధిత అధికారులకు పంపడం జరుగుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఐటిడిఏ సమావేశపు హాలులో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)&( రెవెన్యూ క్లినిక్) కలెక్టర్ కె.దినేష్ కుమార్, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్,పోలవరం జిల్లా రెవిన్యూ అధికారి పి.అంబేద్కర్, నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈ వారం గ్రీవెన్స్ కు 159 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ కి 20 దరఖాస్తులు రావడం జరిగిందని ఆయన తెలిపారు. గుర్తేడు మండలంలోనిగుర్తేడు, ఇర్లవాడ ఆశ్రమ పాఠశాలలో ఏ యన్ యం లను నియమించాలని గుర్తేడు గ్రామ పిసా ఉపాధ్యక్షులు గొర్లె. చిరంజీవి దరఖాస్తును సమర్పించారు. దేవి పట్టణ మండలం డిఎన్ పాలెం గ్రామంలో ఆర్ఎస్కే కేంద్రాన్ని ఏర్పాటు చేసి పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోసు. లచ్చన్న దొర దరఖాస్తు సమర్పించారు. రాజవొమ్మంగి గిరిజన సంక్షేమ శాఖ బాలురు వసతిగృహంలో 480 విద్యార్థులకు డైనింగ్ హాలు, త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు సరిపోవటం లేదని వెంటనే విద్యార్థులకు డైనింగ్ హాలు, త్రాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఎంపీటీసీ కనిగిరి దుర్గా, కనిగిరి దుర్గాప్రసాద్, కనిగిరి వీరబాబు దరఖాస్తు సమర్పించారు, రంపచోడవరం మండలం బోలకొండ గ్రామంలో మెయిన్ రోడ్డుకు రెండు కాలువలకు కలవట్లా ఏర్పాటు చేయాలని చిలకల గుణేశ్వరరావు, విండేల మొట్టయ్యా, విండెల వెంకటేశ్వరరావు దరఖాస్తు సమర్పించారు. ఏటపాక మండలం పురుషోత్తపట్నం పంచాయతీ శ్రీరామ్ నగర్ లో 15 మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోడి లలిత, కొండేటి మంగతాయారు దరఖాస్తు సమర్పించారు. ఈకార్యక్రమంలో ఏపీవోలు జనరల్ డిఎన్వి రమణ,గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య,పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ షేక్ షరీఫ్,డిఎం అండ్ హెచ్ఓ పి సరిత,సిపిఓ వెంకట్రావు,డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్.దాసరి రత్నాకరరావు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహన్, ఎక్స్చేంజ్ అసిస్టెంట్ సూపర్డెంట్ సుబ్రహ్మణ్యం,జిల్లా విద్యాశాఖ అధికారి జి.శ్రీరామ్ మూర్తి , జిల్లా ఉద్యాన శాఖ అధికారి దేవదానం,పీహెచ్ఓ నరేంద్ర కుమార్, ఏజెన్సీ విద్యాశాఖ అధికారి వై.మల్లేశ్వరరావు,జిల్లా మత్స్యశాఖ అధికారి దిల్షాద్, డిడిఓ వెంకటనారాయణ, ఐసిడిఎస్ జిల్లా అధికారి కే.ఉమా,జిల్లా సివిల్ సప్లై అధికారి విజయభాస్కర్,జిల్లా మలేరియా అధికారి భాస్కర రావు,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఐ.శ్రీనివాసరావు అచ్చుతాచారి, రవికుమార్, రాఘవరెడ్డి,జిల్లా ట్రెజరీ అధికారి కుమార్,డిసిహెచ్ఎస్ సాంబశివరావు,పిఏఓఎల్.రాంబాబు, డి ఎల్ పిఓ రాధాకృష్ణ, డిప్యూటీ తహసిల్దార్లు శ్రీధర్, రవీంద్రబాబు, సరిత, శివ, శ్రీరామచంద్రమూర్తి,డిఈలు పి. వెంకటరమణ,రామచంద్ర మూర్తి, శివ,లీడ్,ఆర్టీవో రాజేష్ కుమార్,సబ్ రిజిస్టర్ ఉపేంద్ర,ఐటీడీఏ ఏవో ఎర్రంశెట్టి రాజు, సిడిపిఓలు క్రాంతి కుమరి ,ప్రత్యూష, ఎఫ్డిఓ అనిల్ కుమార్,డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్స్పెక్టర్ ఎం.లక్ష్మణ్,ఏపీ ఈపీడీసీఎల్ ఇంజనీర్ సాలెం రాజ్, డిపిఎం జి. నాగభూషణరావు, జిసిసి డిఎం జయ శ్రీ, తాసిల్దారులు సిహెచ్ బాలాజీ, అమ్మాజీ, సిహెచ్ శ్రీనివాసరావు, శివ,కరక సత్యనారాయణ, తేజస్విని,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular