HomeAndhra Pradeshఆమె అందలం ఎక్కి అదిమాషి చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదు, పై పై ఉత్తమాటాల ఎమ్మెల్యేల మాదిరిగా...

ఆమె అందలం ఎక్కి అదిమాషి చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదు, పై పై ఉత్తమాటాల ఎమ్మెల్యేల మాదిరిగా కాలం ఎల్లతీసేందుకు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టలేదు.

అధికారాన్ని అడ్డుపెట్టుకొని మేడలు, మిద్దెలు కట్టుకోవాలనే ఆమెకి కోరికే లేదు,

దేశ రాజకీయాల్లో అతి పిన్న వయస్సు కలిగిన ఏకైక మహిళా ఎమ్మెల్యే ఆమె,.

ఇంతకీ ఎవరని ఆమె..? ఏంటి ఆ కథ..!!

జిల్లా వాణీ ప్రత్యేక కథనం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గమైన రంపచోడవరానికి ఎమ్మెల్యేగా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గా మిరియాల శిరీష దేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈమె ఎమ్మెల్యే కాక ముందు ఒక సాధారణ అంగన్వాడీ కార్యకర్తగా మారుమూల గ్రామంలో పని చేసేవారు. అలాంటి ఆమె అనూహ్య పరిణామాల మధ్య భర్త విజయ భాస్కర్ ప్రోత్సాహంతో 2024 ఎన్నికలకు ముందు రాజకీయాలలోకి వచ్చారు. రావడమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గలోని 2024లో ఎమ్మెల్యే సీటు కోసం అధ్యదికంగా పోటిపడిన ఎకకై నియోజకవర్గం రంపచోడవరం నియోజవర్గ స్థానం అని చెప్పకనే చెప్పొచ్చు. సుమారు 40కి పైగా టీడీపీ అభ్యర్థిగా సీటు ఆశించి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎంతో మంది పోటీపడ్డారు. మూడు పర్యావరాలు టీడీపీ అభ్యర్థి విజయం సాధించలేని ఆ స్థానంలో ఎవరైతే రంపచోడవరం నియోజకవర్గంలో విజయం సాధించాగలరని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సర్వే చేసికొని, ఎంతో ఆసక్తిగా అందరూ ఎదురుచూస్తూ సమయంలో
కట్ చేస్తే అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసిన మిరియాల శిరీష దేవికి బీ-ఫారం చంద్రబాబు ఇచ్చారు. ఆమెకు టికెట్ ఇవ్వడంతో ఆమెకు వ్యతిరేకంగా ఎంతోమంది మీడియా ముందుకు వచ్చి నానా యాగీరూ చేసి ముక్తకంఠంతో వ్యతిరేకించారు. అయినా కూడా ఆమె ఎక్కడ ఆధరాలేదు, బెదరలేదు. వంటి చేత్తో ఎన్నికల్లో విజయం సాధించి తెలుగుదేశం పార్టీకి కానుక ఇచ్చారు. నీరు పేద గిరిజన కుటుంబం నుండి వచ్చిన ఆమె గిరిజనుల సమస్యలు అన్ని తెలిసిన ఆమె ఆదినుండి ప్రజా సేవకై పరితపిస్తూ తనకు ప్రభుత్వం నుంచి వస్తున్నా నెలవారి గౌరవ వేతనం (నెల జీతం) ప్రజలకు అంకితం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఎమ్మెల్యే అయిన తర్వాత 2024, 2025 సంవత్సరాలలో తన పుట్టినరోజులు సందర్భంగా మొదటి నెల జీతంతో ఆసుపత్రులకు ఇన్వెస్టర్లు కొన్నారు. ఇదే క్రమంలో అంగన్వాడీ టీచర్ గా ఉన్న సమయంలో నెల వాయిదాలతో కొన్న వారి సొంత బొలెరో వాహనాన్ని పోలవరం జిల్లా ప్రజలకు అంబులెన్స్ గా తయారు చేసి జిల్లా ప్రజలకు అంకితం చేశారు. అంతేకాకుండా రంపచోడవరం ప్రధాన కేంద్రంలో పేదలకు ఉచిత ఆటో సర్వీసును అందిస్తున్నారు. అంతేకాకుండా 2026 జూలై 20న తన పుట్టినరోజు సందర్భంగా రాజవొమ్మంగి మండలంలోని ప్రధాన కేంద్రంలో గత 15 సంవత్సరాలు బస్సు సెల్టార్ మరియు మరుగుదొడ్లు లేక విబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి బస్సు సెల్టార్, మరుగుదొడ్లు ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేశారు. అంతేకాకుండా కిండ్రా అడ్డురోడ్డులో ఎమ్మెల్యే శిరీష దేవి మామయ్య కీర్తిశేషులు మఠం జ్యోషి రాజ్ పేరు మీద బస్సు సెల్టార్ ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా మారుమూల లోతట్టు ప్రాంతాల్లోకి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గమనించి 24/7 గంటలు మూడు చక్రాల ఆటో అందుబాటులో ఉండే విధంగా ఆటోను ఏర్పాటు చేశారు. ఈ కోణంలోనే గతంలో రాజవోమ్మంగిలోని పురతన రామాలయ పునర్నిర్మాణానికి 3 లక్షల రూపాయలు ఎమ్మెల్యే శిరీష దేవి, ఆమె భర్త మఠం విజయ భాస్కర్ దంపతులు ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజల సమక్షంలో వారికి డబ్బులు అందజేశారు. ఇటివలే అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వృద్ధ దంపతులకు వారు ఇల్లు నిర్మాణం కొరకు 1 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వారి ఉదారతను చాటుకున్నారు. ఇవే కాకుండా దుస్తులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శిరీష దేవి పుట్టిన రోజును పురస్కరించుకొని చింతూరు , రంపచోడవరం డివిజన్ల పరిధిలోని ఆమె అభిమానులు, ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడికి వచ్చిన వేలాది మంది ప్రజలకు చక్కటి విందు భోజనాలు ఏర్పాటు చేసి వారికి అందజేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రాజవొమ్మంగి మండల ప్రధాన కేంద్రం మరియు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓ పండగ తిరణాలు వాతావరణం కంపించింది. అక్కడి వచ్చిన వారందరూ ఎమ్మెల్యే శిరీష దేవి,ఆమె భర్త విజయ భాస్కర్ దంపతులు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని నియోజకవర్గ అభివృద్ధినీ విజయపదంలో నడిపిస్తూ ప్రజలకు మరింత సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular