కాకినాడ జిల్లా, జగ్గంపేట, జులై 21:జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ట్రస్ట్ చైర్మన్ మరియు జనసేన పార్టీ జగ్గంపేట ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ నేతృత్వంలో మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించి సుమారు 500 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజంలోని నిరుపేదలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా నిరంతరంగా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డించి ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందిస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, గాది నాగరాజు, పులి ప్రసాద్, టాటా శ్రీను, డ్రిల్ మాస్టారు, కొలమూరు బుజ్జి, గోకేడ పండు తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

