
ఎస్.రాయవరం, జిల్లావాణి ప్రతినిధి: మండలంలో ధర్మవరం అగ్రహారం గ్రామానికి చెందిన సిపిఎం, వైస్సార్ సిపి నాయకులు గురువారం, ఎస్.రాయవరం ఎంపీడీవో మీనాకుమారి, ధర్మవరం అగ్రహారం ప్రత్యేక అధికారి సతీష్ లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
ధర్మవరం అగ్రహారం గ్రామానికి చెందిన వారు అనారోగ్యం తో కానీ, ప్రమాదవశాత్తు కానీ బయట ప్రాంతాలలో మరణిస్తే వారి మృతదేహాలు ఉంచడానికి ధర్మవరం అగ్రహారం స్మశాన వాటికలో షెడ్డు లేకపోవడం లో ఆ మృతదేహాన్ని రోడ్డు పైన ఉంచడం జరుగుతుంది. దీని కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కావున వారి ఇబ్బందులు గమనించి మృతదేహాన్ని ఉంచడానికి షెడ్డు నిర్మించాలని కోరామన్నారు
అలాగే దహాన సంస్కారాలు అనంతరం స్నానం చేయడానికి ఎటువంటి నీటి సౌకర్యం లేదు కావున స్నానాలు చేయడానికి వాటర్ ట్యాంక్ నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. ధర్మవరం అగ్రహారం గ్రామంలో 2007 సంవత్సరం లో ఇచ్చిన ఇందిరమ్మ కాలనీ లో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఆ కాలనీలో రోడ్డు, విద్యుత్, మంచినీరు సౌకర్యం కల్పించాలని కోరడం జరిగిందని అన్నారు.
ఈ సమస్యల పై ఎంపీడీవో, ధర్మవరం అగ్రహారం గ్రామం ప్రత్యేక అధికారి స్పందిస్తూ ఈ సమస్యలు ఉన్నతాధికారులు ద్రృష్టికి తీసుకునివెళ్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, వైయస్ఆర్ సీపీ గ్రామ అధ్యక్షులు కర్రి శీనిబాబు, నాయకులు పి.శ్రీనివాసరావు,ఏ.అంజి,పి.సాయి కుమార్, ఎస్.సాయి,బి.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
