చింతపల్లి జిల్లావాణి ప్రతినిధి: కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30, 31 తేదీల్లో కలెక్టరేట్ ముందు మహాధర్నాలు నిర్వహిస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ పిలుపునిచ్చారు. చింతపల్లిలో ప్రజా సంఘాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండల కార్యదర్శి మోరి వెంకట గిరి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ కార్మికులు నిలువున ఆర్థిక దోపిడికి గురవుతున్నారని. ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, స్కీం వర్కర్ల జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే కలెక్టరేట్ ఆఫీసుల ముందు మహాధర్నాల్లో కార్మిక, ఉద్యోగ వర్గాలు అందరూ సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గడుతూరి సత్యనారాయణ, రవి, రాములమ్మ, సత్యవతి, లక్ష్మి జ్యోతి, దిన కుమారి, చెల్లయమ్మ, శేషు తో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం “చలో కలెక్టరేట్” కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను నాయకులు విడుదల చేశారు.
